మహా ధర్నాను జయప్రదం చేయండి….
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: ఆశా వర్కర్లకు కనీస వేతనం రూపాయలు 26000 ఇవ్వాలని మార్చి 6న చలో విజయవాడ నందు మహా ధర్నాను జయప్రదం చేయండి ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపులో భాగంగా ఈరోజు హోళగుంద గజ్జహళ్ళి పిహెచ్సి నందు డాక్టర్లు న్యూటన్ రాధమ్మ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పనిచేయుచున్న ఆశ వర్కర్స్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి చేత శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు ఇతర ఉద్యోగులు మాదిరిగా శ్రామిక మహిళలకు పిఆర్సి గాని ఇంక్రిమెంట్లు గానీ హెచ్ఆర్ఏ గాని టీఏడీఏలు గాని ఏమీ ఇవ్వకుండా డ్యూటీలు చేస్తున్నారని ఆరోపించారు .గత ప్రభుత్వం తొమ్మిది రెండు 2024 ఒప్పందం ప్రకారం కుటుంబ సంక్షేమ అధికారులు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీతో ఒప్పందం చేసుకున్న జీవోలను నేటికీ 11 మాసాలు అవుతున్న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి నిర్లక్ష్య ధోరణి చేయడం సరైనది కాదన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని గ్రాట్యూటీ అయిదు లక్షల రూపాయలు ఇవ్వాలని పెన్షన్ జీతంలో సగం ఇవ్వాలని 62 సంవత్సరములు జీవో వచ్చేంతవరకు ఆశ వర్కర్లను రిటైర్మెంట్ చేయకుండా ఉండాలని కోరారు రాజకీయ వేధింపులు ఆపాలని తదితర డిమాండ్ల సాధనకై మార్చి 6న ఆశ వర్కర్ల డిమాండ్ల సాధనకై చలో విజయవాడ మహా ధర్నాకు ఆశ వర్కర్లు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఆశలు సలోమీ మహాలక్ష్మి ఫాతిమా శ్వేతా సిద్ధలింగమ్మ బసమ్మ గజ్జహళ్ళి ఆశ వర్క్లు తదితరులు తదితరులు పాల్గొన్నారు.