NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ టి యు చేసే పోరాటాలను జయప్రదం చేయండి !

1 min read

ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి రామ మోహన్ రెడ్డి.

పత్తికొండ, న్యూస్​ నేడు:  ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టీయూ చేపట్టబోయే దశల వారి పోరాటాలను జయప్రదం చేయాలని ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పత్తికొండ స్థానిక చదువుల రామయ్య భవన్ ఆవరణంలో ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి రామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్టీయూ దశలవారీగా చేపట్టే పోరాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టియు) తలపెట్టిన దశల వారి పోరాటాన్ని జయప్రదం చేయాలని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు కోరారు .జనవరి 30న మండల తాసిల్దార్లకు వినతి పత్రాల సమర్పణ ,ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా,ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన తెలియజేశారు. పిఆర్సి కమిటీ ఏర్పాటు, ఐ.ఆర్.  మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దు తదితర మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ చేపట్టిన ఉద్యమం అని తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రతి టీచరు పాలుపంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు సీనియర్ నాయకులు నారాయణ ,కొత్తపల్లి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖ ర్ , మండల అధ్యక్ష కార్యదర్శులు ఆవుల నాగరాజు, మారుతి , మద్దికేర మండల అధ్యక్షుడు బీరప్ప, ఆర్థిక కార్యదర్శి మండ్లవెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ రెడ్డి ,చెన్నకేశవరావు ,ఇక్బాల్ హుస్సేన్, మరియు నాయకులు రాధా కృష్ణ ,ఉదయ్ కుమార్, మహమ్మద్ గౌస్, మరియు హరికృష్ణ పాల్గొన్నారు.

About Author