సొంత నిధులతో ఉర్దూ హైస్కూల్‌కు మండిపల్లి హరితమ్మ కంప్యూటర్ల అందజేత
1 min read
ప్రతి విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నత స్థాయికి ఎదగాలి
రాష్ట్రమంత్రి సతీమణి మండిపల్లి హరితమ్మ
అన్నమయ్య జిల్లా ఆగస్టు 5(న్యూస్ నేడు ప్రతినిధి): విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ పేర్కొన్నారు. తన సొంత నిధులతో ఉర్దూ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్లను అందజేసి మండిపల్లి హరితమ్మ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు.చిన్నమండెం ఉర్దూ హైస్కూల్లో విద్యార్థులకు కంప్యూటర్ల కొరత ఉండటంతో, ఆ విషయాన్ని హరితమ్మ దృష్టికి తీసుకురాగా ఆమె వెంటనే సానుకూలంగా స్పందించారు. విద్యార్థుల అవసరాన్ని అర్థం చేసుకుని, ఎలాంటి ఆలస్యం చేయకుండా తన సొంత నిధులతో స్కూల్‌కు కంప్యూటర్లనుఅందజేసి విద్యార్థుల డిజిటల్ విద్యాభ్యాసానికి బలమైన చేయూత అందించారు.ఈ సందర్భంగా స్థానికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హరితమ్మ ఉదారతను కొనియాడుతూ విద్య పట్ల ఆమె చూపుతున్న చిత్తశుద్ధి మరియు సామాజిక బాధ్యతాభావానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.పిల్లల విద్యకు పెట్టే ప్రతి రూపాయి… సమాజ భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి” అనే ఆలోచనతో హరితమ్మ చేస్తున్న సేవలు చిన్నమండెం మండలంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు , విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


