NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు ఎండీ గ్రీన్ సిగ్నల్ : ఇ.యు హర్షం

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:   ఏపి పిటిడి (ఆర్టీసీ) లో విలీనం అనంతరం 2020 నుంచి డివిజనల్ సినియారిటీ సమస్యలతో నిలిచిపోయిన పదోన్నతులపై ఏపియస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ద్వారకా తిరుమళరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం పట్ల ఏపిపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది.గత ఏడాది అక్టోబర్ 18న ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం జీఓ జారీ చేసినప్పటికీ, 28 జిల్లాల్లోని 15 డివిజన్లలో న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా సుమారు 7,500 పదోన్నతుల్లో ఇప్పటివరకు కేవలం 550 మందికే పదోన్నతులు లభించాయని యూనియన్ తెలిపింది. ఈ జాప్యంపై ఇ.యు రాష్ట్ర నాయకత్వం ఈ నెల 26న జరిగిన స్టేట్ సెక్రటేరియట్ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఎండీ కి లేఖ అందజేసింది.దీనిపై స్పందించిన వీసీ & ఎండీ  డివిజనల్ సినియారిటీ అంశాలపై క్లారిటీ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడంతో వారంలోపే సుమారు 4,000 మంది ఉద్యోగులకు ఏడీసీ/కంట్రోలర్లు, లీడింగ్ హెడ్స్, అలాగే విజయననగరం–కడప జోన్లలో జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాసైన కండక్టర్లకు జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కలిగే అవకాశం ఏర్పడిందని వెల్లడించారు.ఈ నిర్ణయానికి వీసీ & ఎండీ కి, ఈడీ (ఏ) కి మరియు ఇతర ఉన్నతాధికారులకు ఇ.యు రాష్ట్ర కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని ఇ.యు రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య తెలిపారు.అదేవిధంగా స్త్రీ–శక్తి పథకాన్ని కండక్టర్లు, డ్రైవర్లు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ విజయవంతం చేస్తున్నారని పేర్కొంటూ, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా విధిస్తున్న సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్ కోతలు వంటి కఠిన చర్యలను నిలిపివేసి, సర్క్యులర్ నెం.01/2019ను కచ్చితంగా అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది.అలాగే గ్రేడ్–2 మెకానిక్‌ల 12 సంవత్సరాల ఏఏఎస్ ఇంక్రిమెంట్లపై ఇచ్చిన రికవరీ ఆదేశాలను వెనక్కి తీసుకొని, గ్రేడ్–1 & 2 మెకానిక్‌లకు న్యాయం చేయాలని కోరుతూ ఎండీ కి లేఖ ఇచ్చామని దామోదరరావు తెలిపారు.

About Author