NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

1 min read

క్యాన్సర్ కు సంబంధించి ప్రత్యేక వైద్య పరీక్షలు,టెస్టులు

జిఎస్ఎల్ సెంటర్ హాస్పిటల్, రాజమండ్రి వారు కార్యక్రమం

ఏలూరుజిల్లా  ,  న్యూస్​ నేడు:  ముందస్తు వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ నివారించుకోవడం చాలా సులభతరమని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థ. పి ఆర్  అహ్మద్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (జంగారెడ్డిగూడెం) అన్నారు. వైద్య పరీక్షలను జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ (రాజమండ్రి) వారిచే ఫ్రీ మెడికల్ క్యాంప్ స్థానిక ఇండోర్ స్టేడియం. నరసింహారావుపేట ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపుకు జిల్లాలో విద్యుత్ కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆల్ట్రా సౌండ్ యబ్డామిన్  స్కానింగ్,చెస్ట్ ఎక్స్-రె,  మమ్మోగ్రమ్ మరియు పప్ప స్మాల్ టెస్ట్  డిజిటల్ ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ ఏలూరు ఎస్.సి  పి.సాల్మన్ రాజు నేతృత్వంలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 6 గంటలకు నిర్విరావంగా కొనసాగింది. అల్పాహారం, త్రాగునీరు తో పాటు మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఉద్యో కుటుంబాల వారికి ఎక్కడ ఏ విధమైన అసౌకర్యాలకు గురికాకుండా వాలంటరీ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఏపీ ఈపీడీసీఎల్ జేఏసీ నాయకులు తురగా రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ వినియోగదారుల కోసం రాత్రనకా పగలనకా అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారని, పని ఒత్తిడిలో  భాగంగా వారు ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కష్టపడుతుంటారు. వారికి వారి కుటుంబాల వారికి క్యాన్సర్లు ముందస్తు వైద్య పరీక్షలు ద్వారా క్యాన్సర్ ను నివారించుకోవడం చాలా ఉపయోగకరమైనదని. తద్వారా ఆరోగ్యాన్ని ముందుగానే పరీక్షల ద్వారా జాగ్రత్త పరుచుకోవడం చాలా మంచిదన్న ఉద్దేశంతోమా ఎస్.సీ పి.సాల్మన్ రాజు. ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు, ఏలూరు సర్కిల్ నేతృత్వంలో  ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం మా ఎలక్ట్రికల్ ఉద్యోగుల అందరికీ చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రమేష్ ,పి.శ్రీనివాస్,వి. రాము, కె.గంగాధర్  ఎస్.బలుసు బాబు, రఘు బాబు, సంజయ్ కుమార్, వివిధ కేటగిరీల డిఇ లు,ఏఈలు తదితర ఉద్యోగులు వాలంటీర్లుగా పాల్గొని విజయవంతం చేశారు.

About Author