NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

1 min read

మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలపై చర్యలు

పెదపాడు ఎస్సై కట్టా శారద సతీష్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్  ఆదేశాల మేరకు, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా, ఏలూరు పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ అఖిల్ జామా  ఆధ్వర్యంలో,పెదపాడు ఎస్సై కట్టా శారద సతీష్, డి.టి.ఆర్.బి.మధు,రోడ్ సేఫ్టీ సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.నేషనల్ హైవేలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో, ఏలూరు కలపర్రు టోల్ గేటు వద్ద ఉన్న వై-జంక్షన్ వద్ద ఓవర్ స్పీడ్‌గా వెళ్లే వాహనాలపై దృష్టి సారించారు. స్పీడ్ హంటర్ పరికరం ద్వారా మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలను గుర్తించి, వాటిపై జరిమానాలు విధించారు. ఈ తనిఖీలలో పలు వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని కోరారు.భవిష్యత్తులో కూడా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని, రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వారు స్పష్టం చేశారు.ఈ చర్యలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడతాయని తెలియ చేసినారు.

About Author