మానవత మహిళా విభాగం ఆధ్వర్యంలో “మెడికల్ క్యాంప్”..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్, కార్డియాలజీ, ఆర్తో, జనరల్ మెడిసిన్ వైద్యులతో వైద్య పరీక్షలు, సలహా సూచనలు… అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ “మహిళా విభాగం” ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఏ క్యాంప్ అందలి మాంటిస్సోరి స్కూలు యందు “ఉచిత మెడికల్ క్యాంప్” నిర్వహించడం జరిగింది. ఇందులో 250 వైద్య పరీక్ష నిర్వహించారు. అందులో 200 మందికి ఈసీజీ, టు డికో, 35 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాప్స్మీయర్ టెస్ట్ లు చేయించుకోవడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపుకు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఈసీజీ, 2dఇ కో, పాప్స్ నియర్, ఆర్ బి ఎస్, సీరం క్రియాటిన్, వంటి టెస్టులు ఉచితంగా చేయడం జరిగింది. అదేవిధంగా గైనకాలజీ కార్డియాలజీ ఆర్తో జనరల్ మెడిసిన్ డాక్టర్లు క్యాంపులో వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ మెడికల్ కాంప్లో కిమ్స్ వైద్యులు డా. దివ్య లత, డా.కుసుమ, డా. ప్రవల్లిక, డా. సందీప్ కుమార్, డా. కిరణ్ కుమార్ లు, నర్సింగ్ హచ్ ఓ డి జావేద్, మేనేజర్ మోతి భాష లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళా విభాగం కన్వీనర్ యాని ప్రతాప్, అధ్యక్షురాలు పద్మ, ప్రోగ్రామ్ కన్వీనర్ అపర్ణ, లక్ష్మీ, చంద్రకళ, సుభద్రమ్మ మంజుల,లక్ష్మీ, నూరి, విజయ లు కార్యక్రమాన్ని నడిపించగా మానవత నుండి కన్వీనర్ మనోహర్ రెడ్డి, అధ్యక్షులు రమణ, సీనియర్ నాయకులు యుగంధర్, శివారెడ్డి, రాయపాటి శ్రీనివాస్, ప్రతాప్, స్పందన సురేష్, సునీల్, శ్రీనివాస్ యాదవ్, ఈశ్వర్ రెడ్డి, అంజి తదితరులు పాల్గొనీ సహాయ సహకారాలు అందించారు.

