మహిళా పోలీసుల సేవలు ప్రశంసనీయం….
1 min read
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసిన…
కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా గారు.
కర్నూలు, న్యూస్ నేడు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ హుస్సేన్ పీరా మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ…మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.మహిళా దినోత్సవ వారోత్సవాలలో జరిగిన ఆటల పోటిలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశామన్నారు. మహిళా పోలీసులు సమాజ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అమ్మలేనిదే సృష్టి లేదన్నారు. భారతదేశం వసుదైవ కుటుంబం అనే భావనతో ముందుకు సాగుతుందని, అందరూ కలిసి మెలిసి మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. మహిళల భద్రత కు మరియు శాంతి భద్రతల పరిరక్షణలో వారి సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు. ఉత్సాహంతో పని చేస్తూ ప్రజలకు మంచి సేవలందించాలని సూచించారు.పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ విధుల్లోనే కాకుండా క్రీడలలో కూడా మహిళలకు స్ఫూర్తిగా రాణిస్తున్న ఆర్ ఎస్సై కల్పన ని అడిషనల్ ఎస్పీగారు శాలువ, మెమోంటోతో ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఎఓ విజయలక్ష్మీ, డిటిఆర్బి సిఐ ఆదిలక్ష్మీ, ఆర్ ఐ నారాయణ, మహిళా ఆర్ ఎస్సైలు కల్పన, మహాలక్ష్మీ, మహిళా పోలీసు సిబ్బంది శక్తి టీం, మహిళా హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.

