విభజన చట్టంలోని అంశాల పై సమావేశం
1 min readపల్లెవెలుగువెబ్ : విభజన చట్టంలోని అంశాలపై ఇవాళ కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరిపింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు రావాల్సిన బకాయిలపై పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు టీఎస్ జెన్కో ఇవ్వాల్సిన 3442 కోట్లను విడుదల చేయాలని ఏపీ కోరింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరాను నిలిపివేయడం సరైంది కాదని తెలంగాణ వాదించింది. దీనివల్ల హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ , M/ s ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ , కృష్ణ పట్నం పవర్ ప్లాంట్‌ల నుండి తక్కువ ధరకు విద్యుత్ అందకుండా పోతుందని తెలంగాణ తెలిపింది. తెలంగాణకు రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ జెన్కో ద్వారా హై కోర్టులో కేసు వేయడం సరికాదని తెలంగాణ పేర్కొంది.