మంత్రి టి.జి. భరత్ చేతులు మీదుగా దివ్యాంగునికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ అందజేత
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ నియోజకవర్గం 47వ వార్డుకి చెందిన దివ్యాంగుడు విజయ్ కి మంత్రి టి.జి. భరత్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ పంపిణీ చేశారు. టీడీపీ కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్ ఇటీవల వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడు విజయ్ వీల్ చైర్ కావాలని అడిగారు. ఈ నేపథ్యంలో సోమిశెట్టి శ్రీకాంత్ రూ.40 వేల స్వంత నిధులతో ఎలక్ట్రిక్ వీల్ చైర్ తెప్పించి మంత్రి కార్యాలయంలో మంత్రి టి.జి. భరత్ చేతుల మీదుగా దివ్యాంగునికి అందజేశారు. ఇందుకు ఎంతగానో సంతోషించిన దివ్యాంగుడు తనకు చేయూతను ఇచ్చిన దాతలు సోమిశెట్టి శ్రీకాంత్ కి, ఆశీస్సులు అందజేసిన మంత్రి టి.జి. భరత్ కి కృతజ్ఞతలు తెలిపారు.

