NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ధరిత్రీ దినోత్సవం.. క్విజ్ పోటీలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఈనెల 22న దరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో కే.ఎన్.ఆర్ స్కూల్ ఆవరణలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ నీటిని ఆదా చేయడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం,సౌర శక్తిని వినియోగించుకోవడం వల్ల పర్యావరణ పరిరక్షణకు మన వంతు కృషి చేసిన వాళ్లమవుతామన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షులు లయన్ టి.గోపీనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలని పర్యావరణాన్ని కాపాడడం మన భవిష్యత్తును కాపాడడమే అవుతుందన్నారు. కార్యక్రమంలో క్విజ్ మాస్టర్ పీ జగదీష్,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి  రాయపాటి నాగలక్ష్మి,ఉపాధ్యాయులు శ్రీ లక్ష్మీ,షరీఫ్,విజయలక్ష్మి, అశ్వక్,లైన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *