NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వల్ప వ్యయ నిర్వహణ పనులను వెంటనే చేపట్టాలి

1 min read

నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశం

కనీస సదుపాయాల కల్పనలో జాప్యం తగదు

కర్నూలు, న్యూస్​ నేడు:  శుక్రవారం నగర ప్రజలకు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటి ప్రాథమిక సేవల్లో స్వల్ప వ్యయంతో ఎక్కువమందికి ప్రయోజనం చేయగలిగే పనులను వెంటనే చేపట్టాలని నగరపాలక సంస్థ చల్లా ఓబులేసు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఏ.క్యాంపు చాణక్యపూరి కాలనీ, లక్ష్మీగార్డెన్స్, జొహరపురం, రాజేశ్వరి నగర్, ఎఫ్‌సిఐ కాలనీ, చల్లా వారి వీధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తాగునీటి సరఫరాపై స్థానికులకు ఆరా తీశారు. పుష్‌కార్టుల మరమ్మత్తులు, నీటి సమస్య తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పైప్‌లైన్ల అనుసంధానం వంటి నిర్వహణ పనులకు వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అదే విధంగా బళ్ళారి చౌరస్తా వద్ద బైపాస్ రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ఎస్‌ఏపి క్యాంపులో పారిశుద్ధ్య కార్మికులకు యోగాసనాలు కార్యక్రమం కోసం వేదికను పరిశీలించారు. రాజేశ్వరి నగర్ పార్కులో బెంచీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్న క్యాంటీన్ పరిశీలించారు. స్వచ్ఛత నాణ్యతపై ప్రజలతో మాట్లాడారు. బయట వరండాలో 12 టేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, డిఈఈ నరేష్, ఏఈ జనార్ధన్, శానిటేషన్ ఇంస్పెక్టర్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

About Author