ఐవిఆర్ఎస్ కాల్స్ పై ఎమ్మెల్యే అసంతృప్తి
1 min read
మిడుతూర్-గార్గేయపురం రోడ్డు పనులు ప్రారంభించాలి..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: వివిధ శాఖల గురించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఐవిఆర్ ఎస్ కాల్స్ లో ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులపై మండిపడ్డారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పరిషత్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిడుతూరు- గార్గేయపురం రోడ్డు అధ్వానంగా ఉందని రెండు వారాల్లోపు రోడ్డు పనులు ప్రారంభించాలని ఆర్అండ్ బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.విద్యుత్, రెవెన్యూ,పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజల అసంతృప్తిగా ఉన్నారని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని చిన్నపాటి వర్షానికే మిడుతూరు ఆటో స్టాండ్ ప్రాంతంలో నీళ్లు నిల్వ ఉంటున్నాయని ఎస్టిమేషన్ చేయాలని ఎమ్మెల్యే అన్నారు.మండలంలో వివిధ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఎక్కడెక్కడ అవసరమో రెండో విడతలో వాటి నివేదికలు తయారు చేయాలని పిఆర్ఏఈ ప్రతాప్ రెడ్డిని ఆదేశించారు. నాగలూటిలో మహిళా పొదుపు గ్రూపులో సభ్యులకు తెలియకుండానే లక్షల రూపాయలు వాడుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారని వైస్ ఎంపీపీ నభి రసూల్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే
రోళ్లపాడు గ్రామానికి చెందిన కురువ మద్దమ్మకు- 1లక్ష 11 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దశరధ రామయ్య,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, రోళ్లపాడు మాజీ సర్పంచ్ నాగ స్వామి రెడ్డి,విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి కుమార్ మరియు వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


