NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

19 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:   పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ కే.ఈ. శ్యామ్ కుమార్  అన్నారు.పత్తికొండ ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు రూ.16 లక్షల విలువైన చెక్కులను 19 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్యాం కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందని పేర్కొన్నారు.ప్రజలకు అవసరమైన ప్రతి ప్రభుత్వ పథకం అర్హులకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Author