NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అలరించిన హరికథా .. సంగీత కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: సంజామల మండలం, పేరుసోముల గ్రామంలో వెలసిన సుప్రసిద్ద శ్రీ విష్ణుకంటి క్షేత్రం 16వ వార్షికోత్సవాలలో భాగంగా రెండవరోజు  తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వై. రమేశ్ బాగవతార్ చే హరికథా, పి. వి. రమణమూర్తిచే సంగీత కార్యక్రమం నిర్వహించారు. సహకార వాయిద్యాలుగా యం. బాలస్వామి కీబోర్డు, పి. ఆనంద్ బాబు తబలా సహకారం అందించారు. అంతకుముందు ఇస్కాన్ ధర్మ ప్రచారకులు శ్రీనిత్యతృప్తదాస్ స్వామిచే భగవద్గీత ప్రవచనం, నంద్యాల భక్తబృందంచే విష్ణు సహస్రనామ పారాయణం, అన్నకూటోత్సవం తదితర కార్యక్రమాలు పీఠాధిపతి శ్రీ రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో  జరిగాయి. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు స్వామివారి శిష్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *