NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

27వ డివిజన్‌ లో సిసి రోడ్డు, డ్రైనేజి, నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

1 min read

28వ డివిజన్‌ బిడి కాలనీలో నిర్మించిన సిసి రోడ్డును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీన

ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతాక్రమంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిచేస్తున్నట్లు వివరణ

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజలంతా ముక్తకంఠంతో, ఏకపక్షం వహించి గెలిపించుకున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు అనునిత్యం శ్రమిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపేందుకు అభివృద్ధి పనుల్లో వారిని బాగస్వాములను చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏలూరు నగర ప్రజలందరికీ 138కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గోదావరి జలాలను సమృద్దిగా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, త్వరలోనే ఈ బృహత్‌ ప్రణాళిక పనులు ప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు. ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 15వ ఆర్ధిక సంఘం నిధులు 37లక్షల రూపాయలతో స్థానిక 27వ డివిజన్‌ కండ్రికగూడెం సెంటర్‌ బాలాజీ నగర్‌లో నిర్మించిన సిసి రోడ్డు, డ్రైనేజి, 28వ డివిజన్‌ బిడి కాలనీలో నిర్మించిన సిసి రోడ్డును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటించిన ఆయన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై వారి మనోగతాలను తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతాక్రమంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిచేస్తున్నట్లు వారికి వివరించారు. ఇంకేమైనా సమస్యలున్నాయా అంటూ వారిని ప్రశ్నించి వారి వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఒక్కొక్కటిగా అన్ని పనులు పూర్తి చేయడం జరుగుతుందని, ప్రజలు తమ కళ్ళ ఎదుట జరుగుతున్న అభివృద్ధిని కూడా మిగిలిన వారితో పంచుకుని కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతివ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే బడేటి చంటిని అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ కర్రి శ్రీనివాసరావు, కో- ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్‌ పెదబాబు, కార్పొరేటర్‌ తంగిరాల అరుణ, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి 27వ డివిజన్‌ ఇన్‌ఛార్జి యడ్లపల్లి శివ, కో ఇంచార్జ్ బోడెం వెంకట్రావు, 28, డివిజన్ కో ఇన్చార్జ్ మహమ్మద్ ఖాజా, శనివారం పేట సహకార బ్యాంకు చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, ఏలూరు అగ్రికల్చర్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్, పార్టీ నాయకులు బెజ్జం అచ్చయమ్మ తంగిరాల సురేష్‌, లంకపల్లి మాణిక్యాలరావు, కందుల రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *