NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వరల్డ్ ఆస్తమా డే  సందర్భంగా అవగాహన

1 min read

మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 5న నిర్వహించే వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో ఆస్తమా (దమ్ము)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో శ్వాసకోశ ఆరోగ్యంపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా పల్మనాలజిస్ట్ డా. వినోద్ ఆచారి మరియు పల్మనాలజిస్ట్ డా. సువర్ణ లక్ష్మి కళ్లి పాల్గొని ఆస్తమా వ్యాధి గురించి విపులంగా వివరించారు. ఈ సంవత్సరం థీమ్ “Access to anti-inflammatory inhalers for everyone with asthma – still an urgent need” ఆధారంగా ప్రతి ఆస్తమా రోగికి అవసరమైన ఇన్హేలర్ చికిత్సలు అందుబాటులో ఉండటం ఎంత ముఖ్యమో వివరించారు.వైద్యులు మాట్లాడుతూ, ఆస్తమా ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి అని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఛాతీలో బిగుతు, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ముఖ్యంగా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఇన్హేలర్లు వాడడం ద్వారా ఆస్తమా నియంత్రణలో ఉంచవచ్చని, రోగులు వైద్యుల సూచనల మేరకు చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేషెంట్లు తమ సందేహాలను వైద్యులతో నేరుగా చర్చిస్తూ ప్రశ్నలు అడిగారు. వైద్యులు వారి ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇస్తూ సరైన అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్​ రెడ్డి  మాట్లాడుతూ,“ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం చాలా అవసరం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా రోగుల్లో నమ్మకం పెరిగి, సరైన చికిత్స తీసుకునే అవగాహన కలుగుతుంది. మా ఆసుపత్రి ఎల్లప్పుడూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కట్టుబడి ఉంది” అని తెలిపారు.

About Author