NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

1 min read

ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పదివేల నగదు

ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య:ఎమ్మెల్యే..

నందికొట్కూరు న్యూస్ నేడు: గతంలో విద్యార్థులకు ఇచ్చిన మాటను తన చేతుల ద్వారా ఆ మాటను నెరవేర్చుకున్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య..నంద్యాల జిల్లా పగిడ్యాలమండలం లక్ష్మాపురం అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం(మెగా పీటీఎం-4.0)ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థికంగా కుటుంబాలను ఆదుకునేందుకు గాను ప్రజలకు ఇచ్చిన మాట మేరకు విద్యార్థుల తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పథకం కింద 13 వేల నగదు వేయడం జరిగిందన్నారు.విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు గాను వారికి తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని వీటిని దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

ప్రతిభ కనబరచిన విద్యార్థులకు 15 వేల నగదు

గతంలో ఈ పాఠశాలలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై పదవ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరచిన ప్రతి విద్యార్థికి 10 వేల నగదు ఇస్తానని స్వయంగా ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ ఇచ్చారు.ఇచ్చిన మాటకు గాను విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 వేల నగదును ఎమ్మెల్యే అందజేశారు.ఈ.షణ్ముఖ ప్రియా-582..యం.అమృత 572,ఎస్.అనిత- 571,జి.హారిక-566,పి. జోత్స్న-565 వీరికి ఎమ్మెల్యేనగదును అందజేశారు.విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కిట్లను అందజేశారు.విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుభాన్,పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరమణమ్మ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author