కార్పొరేషన్ లో పదోన్నతి పొందిన ఉద్యోగ సిబ్బందికి అభినందన సభ
1 min read
వాటర్ సప్లై, డిస్ట్రిబ్యూషన్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది నగర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారు
కార్పొరేషన్ ఇంజనీర్ సురేంద్రబాబు
కార్పొరేషన్ లో పదోన్నతి పొందిన 9 మంది ఉద్యోగ సిబ్బందికి అభినందలు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం వాటర్ సప్లై మరియు డిస్ట్రిబ్యూషన్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది నగర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని కార్పొరేషన్ ఇంజనీర్ సురేంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కోట దిబ్బ ఎస్ ఆర్ వన్ వద్ద ఏఐటీయూసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల కార్పొరేషన్ లో పదోన్నతి పొందిన 9 మంది ఉద్యోగ సిబ్బందిని అభినందిస్తూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. అప్పలరాజు అధ్యక్షత వహించారు. ఏలూరు కార్పొరేషన్ లో ఇద్దరికి ట్యాప్ ఇన్స్పెక్టర్లుగా, నలుగురుకి ఫిట్టర్స్ గా, ముగ్గురికి డ్రైవర్స్ గా పదోన్నతి కల్పించిన మున్సిపల్ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు,మేయర్ కు, కార్పొరేటర్లకు యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేషన్ ఇంజనీర్ సురేంద్రబాబు మాట్లాడుతూ పదోన్నతులు సర్వీస్ ఆధారంగా, విద్యా అర్హతలు బట్టి వస్తాయని ఎవరి దయాదాక్షిణ్యల మీద రావని ఆయన తెలిపారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు కింద స్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా ఉంటూ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈలు రజాక్, అప్పలరాజు, ఏఈలు సాయి, రఫీ, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, మాజీ కౌన్సిలర్ యూనియన్ వ్యవస్థాపకులు చిలుకూరి రమేష్ కుమార్, యూనియన్ నాయకులు ఎస్ శ్రీనివాసరావు, డి వెంకటేశ్వరరావు, ఎస్ కే ఆలీ, ఎస్ గౌరీ శంకర్ ఉద్యోగ సిబ్బంది మరియు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. బి నారాయణరావు, నారా శ్రీనివాసరావు కు ట్యాప్ ఇన్స్పెక్టర్లుగా , బంగారు గోపి, సిహెచ్ అప్పారావు, పి దుర్గారావు, నవీన్ కు పిట్టర్స్ గా, ముగ్గురు పిహెచ్ వర్కర్స్ పంతం వెంకటేశ్వరరావు, డి అప్పారావు, ఎం గోవింద్ కు డ్రైవర్స్ గా పదోన్నతి కల్పించారు.


