NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిశుభ్రమైన గ్రామాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది

1 min read

– మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, మరియు నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు ఎన్.రాజారెడ్డి కౌతాళం టౌన్‌లో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.

కౌతాళం న్యూస్ నేడు: మండల కేంద్రమైన కార్యక్రమం నిర్వహించగా, రాఘవేంద్ర రెడ్డి, ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులతో కలిసి స్వయంగా పనిముట్లు పట్టుకుని రోడ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ పరిశుభ్రతపై తన నిబద్ధతను చాటి చెప్పారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకోసం అధికారులు – ప్రజలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సతీష్ నాయుడు, మండల అధ్యక్షులు సురేష్ నాయుడు,టీబీ.ఎల్ ఎల్ సి  చైర్మన్ టిప్పు సుల్తాన్, సొసైటీ చైర్మన్ వెంకటపతి రాజు,అడివప్ప గౌడ్,కుంబులురు చిన్న,ఉపాధ్యక్షలు వీరేష్,రాజనందన్,సౌద్రి బసవరాజు, గిరి, ముకన్నా,ప్రభుత్వ అధికారులు,పంచాయతీ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *