వైసీపీ రాక్షస పాలనలో బలైన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
1 min read
కంకిపాడు, న్యూస్ నేడు : మండలం ప్రొద్దుటూరు గ్రామ బీసీ కాలనీలో అమర్నాథ్ గౌడ్ మూడో వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ బీసీ సంఘాల ప్రతినిధులు,కూటమి నాయకులు,టిడిపి కార్యకర్తలు,మహిళలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ,గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు,అకృత్యాలను ప్రజలకు గుర్తు చేయడం కోసం ఈ కార్యక్రమంనిర్వహిస్తున్నామని తెలిపారు,చిన్న వయసులోనే అమర్నాథ్ గౌడ్‌పై జరిగిన దారుణ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందని,అమాయక బాలుడిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం మానవత్వానికే మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ పాలనలో ఎస్సీ,బీసీ,బలహీన వర్గాల ప్రజలపై దాడులు,హత్యలు, వేధింపులు జరిగాయని,ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు,సైకో పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని,అలాంటి దురాగతాలను ప్రజలకు గుర్తు చేస్తూ బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అమర్నాథ్ గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికార దాహంతో కుటుంబ సభ్యులపైనే అన్యాయం చేశారని,నేడు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు,కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, వైసీపీ నాయకులు ఈర్ష్యతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.అలాగే గత ప్రభుత్వ అండతో మహిళలను అవమానించిన సోషల్ మీడియా సైకోలపై కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే,విదేశాల్లో ఉండి బెదిరింపులకు పాల్పడుతున్నారని,అధికారం లేకుండానే ఇలా ప్రవర్తిస్తే అధికారం వస్తే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని అన్నారు.ప్రజల కోసం పనిచేయడమే తమ ధ్యేయమని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రొద్దుటూరు గ్రామానికి ఇచ్చిన హామీ మేరకు రూ.1.50 కోట్ల నిధులతో రోడ్లు,డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని తెలిపారు,మిగిలిన అభివృద్ధి పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా గ్రామస్తులు సహకరించాలని కోరారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మరియు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరాస్వామి ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ దుదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాలాజీ కంకిపాడు ఏఎంసీ చైర్మన్ అన్ని ధనయ్య బిసి సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు కంకిపాడు మండల పార్టీ అధ్యక్షులు జంపని వెంకటేశ్వరరావు మాజీ ఎంపీపీ నెరసు రాజ్యలక్ష్మి మండల పార్టీ కార్యదర్శి వీరంకి పవన మూర్తి గ్రామ పార్టీ అధ్యక్షులు ఈడ కోటేశ్వరరావు చిట్టూరి నాగేశ్వరరావు కంకిపాడు మండల బీసీ సెల్ అధ్యక్షులు బొర్రా వెంకట్ బీసీ సంఘాల నాయకులు, కూటమి నాయకులు,టిడిపి కార్యకర్తలు, మహిళలు,గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


