PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కండరం..కంట్రోల్​ తప్పుతోందా..!

1 min read

అలసి..సొలిసిపోతున్న కండరాలు..

  • నమలడం..మింగడం…ఇబ్బందే..!
  • ‘మయాస్థీనియా గ్రావిస్’తో అవస్థలు పడుతున్న రోగులు
  • మెరుగైన చికిత్సతో… వ్యాధి నియంత్రించవచ్చు..
  • ప్రముఖ న్యూరాలజిస్ట్​ డా. హేమంత్​ కుమార్​

మారిన జీవనశైలిలో భాగంగా తీసుకునే ఆహారం…వ్యాయామం లేకపోవడం…తదితర కారణాలతో ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే కరోన తరువాత చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కానీ వ్యాధి లక్షణాలను బట్టి.. వ్యాధి పేరు కూడా తెలుసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారంటే… ఆరోగ్యం పై వారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటో ఇట్టే .. తెలుస్తోంది. ప్రస్తుతం చాలా మంది ‘మాయాస్థీనియా గ్రావిస్​’ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తెలియక …చికిత్స చేయించుకోలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆ వ్యాధి లక్షణాలు ఉంటే… ముందు జాగ్రత్తగా మెరుగైన చికిత్స చేస్తే సాధారణ జీవితం గడపవచ్చని స్పష్టం చేశారు  ప్రముఖ న్యూరాలజిస్ట్​ డా. హేమంత్​ కుమార్​.

పల్లెవెలుగు, కర్నూలు: వయస్సు పెరిగే కొద్దీ… మనిషి శరీర భాగాలలో మార్పు రావడం సహజం. కానీ ‘మాయాస్థీనియా గ్రావిస్’ వ్యాధితో బాధపడే వారు.. వయస్సుకు సంబంధం లేకుండానే ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా  కండరాలపై ప్రభావితం చూపుతాయి. కండరాలు త్వరగా అలిసిపోవడం… బలహీన పడటం.. వంటివి జరుగుతాయి.  వ్యాధి లక్షణాలు గుర్తించి…మెరుగైన చికిత్సతో నియంత్రించవచ్చని వెల్లడించారు న్యూరాలజిస్ట్​ డా. హేమంత్​ కుమార్​.

కండరం కదలికలో మార్పు..:

ఈ వ్యాధితో బాధపడే వారి కండరాలు బలహీనంగా మరియు సులభంగా అలిసిపోతాయి. ఆహారం తీసుకున్నప్పుడు  నోటిలో దవడ కండరాలు త్వరగా అలిసిపోతాయి.. బలహీనపడుతుంటాయి. నమలడానికి.. మింగడానికి కష్టపడతారు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్లీ కండరాలు బలపడతాయి. ఆహారాన్ని నమిలి మింగవచ్చు. ఇలా ప్రతిసారి భోజనం చేసే సమయంలో అవస్థ పడుతూనే ఉంటారు.

కనురెప్పలు..మూసుకుపోవచ్చు…:

మయాస్థీనియా గ్రావిస్ కేసులలో దాదాపు 50 శాతం మంది కంటి సమస్యతో అవస్థలు పడుతుంటారు. కంటి కండరాల కదలికలో మార్పు వల్ల కనురెప్పలు మూసుకుపోవడం (పడిపోవడం).. , ఒక వస్తువు రెండుగా కనిపించడం లేదా క్షితిజ సమాంతరంగా నిలువుగా కనిపించడం వంటివి జరుగుతాయి. 

గొంతు…ముఖం..:

అదేవిధంగా గొంతు, ముఖంపై ప్రభావం చూపుతాయి.  బలహీనం (నెమ్మది)గా  మాట్లాడటం.. ప్రసంగం భిన్నంగా ఉండవచ్చు. ఆహారం నమలడం… మింగడం..నీరు తాగడం ..కష్టతరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మింగడానికి ప్రయత్నించే ద్రవాలు ముక్కు నుంచి బయటకు రావచ్చు. ముఖ కవలికలు భిన్నంగా కనిపిస్తాయి.

వ్యాధి నిర్ధారించడం ఇలా..

కండరాల స్థాయి, స్పర్శ భావం, ప్రతిచర్యలు, సమన్వయం, కండరాల బలం మరియు సమతుల్యతను పరీక్షించడం ద్వారా రోగి నరాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తారు.

రక్త పరీక్ష:

కండరాల రిసెప్టర్ సైట్‌లను నాశనం చేసే అసాధారణ యాంటీబాడీస్ ఉనికిని తనిఖీ చేయడానికి రక్త పరీక్ష నిర్వహించబడుతుంది.

నరాలు లేదా కండరాల మధ్య సంబంధాన్ని మెరుగుపరచడానికి నియోస్టిగ్మైన్ లేదా పిరిడోస్టిగ్మైన్ వంటి మందులను మీకు అందించవచ్చు. ఈ మందులు శాశ్వత పరిష్కారాన్ని అందించవు కానీ కండరాల బలం మరియు కండరాల సంకోచాన్ని మెరుగుపరుస్తాయి.

రోగనిరోధక మందులు:

మైకోఫెనోలేట్ మోఫెటిల్, మెథోట్రెక్సేట్, అజాథియోప్రిన్, టాక్రోలిమస్ మరియు సైక్లోస్పోరిన్ వంటి మందులు మీ రోగనిరోధక వ్యవస్థను మార్చడంలో సహాయపడతాయి.

వ్యాధి నియంత్రణ ఇలా..

ప్లాస్మాఫెరిసిస్:

ఈ చికిత్స డయాలసిస్ మాదిరిగానే ఉంటుంది. రోగి రక్తం నుండి ప్రతిరోధకాలు యంత్రం ద్వారా రూట్ చేయడం ద్వారా తొలగించబడతాయి.

ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్:

ఈ చికిత్స రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను మార్చడానికి,  రోగి శరీరానికి సాధారణ ప్రతిరోధకాలను అందిస్తుంది. ప్రయోజనాలు ఒక వారంలో కనిపిస్తాయి

సర్జరీ:

కొన్ని సందర్భాల్లో మయాస్థీనియా గ్రావిస్ ఉన్న వ్యక్తులు థైమోమాను కలిగి ఉంటారు – థైమస్ గ్రంధిలో కణితి. అప్పుడు డాక్టర్ గ్రంధిని తొలగిస్తారు.

About Author