రాజకీయాలలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఏది..
1 min readగుర్తించని పార్టీలు.. పదవుల్లో వివక్ష???
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల కేంద్రం ముస్లిం మైనార్టీలు. ఇక్కడ అంటరాని వారిగా మిగిలిపోయారు రాజకీయ పార్టీల్లో కనీసం ఉనికి లేని ముస్లింలు అభివృద్ధికి సామాజిక జీవన విధానానికి మార్పు లేకుండా మూలన ఉండిపోయారు, పండగ రోజున ప్రార్థనలు చేసుకోవడానికి సరైన ఈద్గా ముస్లిం కమ్యూనిటీకి షాది ఖానా లేకపోవడం ముస్లింలకు ప్రాధాన్యత ఎంత మేరకు ఉందో తెలిసిపోతుంది గతంలో ఎప్పుడో టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన షాదీఖానా అరకోర నిర్మాణంతో ఆగిపోయిన శిథిలావస్థకు చేరుకోవడం. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో అన్యక్రాంతం అయిపోయింది. షాది ఖానా కలగానే మిగిలిపోయింది . ఇక తమ సామాజిక వర్గం సమస్యలపై బాణీ వినిపించే నాయకులు ముస్లిం మైనార్టీలో లేకపోవడం గడివేముల గ్రామ ముస్లింలకు పెద్ద మైనస్ ఎన్నికలలో ఓటు బ్యాంకుగా మిగిలిపోతున్న జీవన విధానంలో ఎటువంటి మార్పు రాకపోగా అట్టడుగు స్థాయి వర్గంగా మిగిలిపోతున్నారు దీంతో రాజకీయ పార్టీలు మైనార్టీలకు పదవులతో సత్కరించిన దాఖలాలు లేవు ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు తమ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం ఏకమై తమ సామాజిక వర్గం కోసం నడుము కట్టాల్సిన సమయం ఆసన్నమైంది మరో కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా తమ డిమాండ్లను ఓట్ల కోసం వచ్చే పార్టీలకు వినిపించి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీల్లో గడివేముల గ్రామ ముస్లిం మైనార్టీలకు పదవులు ఇచ్చి వారి ప్రాధాన్యతను గుర్తించి గౌరవించాలని గడివేముల గ్రామ ప్రజలు కోరుతున్నారు..????? వేచి చూడాలి మరి.