కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన నాగన్న..
1 min read

మాజీ ఎమ్మెల్యే ఆర్థర్ ముఖ్య అనుచరుడు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లె నడిపి నాగన్న కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి సమక్షంలో అల్లూరు గ్రామంలో శివానందరెడ్డి స్వగృహంలో నాగన్నతో పాటు మరో 50 కుటుంబాలు శివానందరెడ్డి సమక్షంలో టిడిపి చేరారు. వీరందరికీ పసుపు కండువా కప్పి తెదేపా పార్టీలోకి ఆహ్వానించారు.కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని అంతేకాకుండా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమనే నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు నాగన్న తెలిపారు.గతంలో నందికొట్కూరు ఎమ్మెల్యేగా తోగూరు ఆర్థర్ వైసీపీలో ఉన్నప్పుడు ఆయన అడుగుజాడల్లో నడిచామని చివరకు గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వైసీపీ అవకాశం ఇవ్వలేదని తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేతో పాటుగా నేనూ వెళ్లడం జరిగిందని అన్నారు. నియోజకవర్గాన్ని శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నాగన్న అన్నారు.ఈకార్యక్రమంలో మిడుతూరు మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,తిమ్మాపురం వేణుగోపాల్ రెడ్డి, ముత్తుజావలి,షఫీ, మహబూబ్ హుస్సేన్,నబి రసూల్,నడిపి సుల్తాన్,భాష, శ్రీరాములు మధు, వెంకటస్వామి,భూషణం, జగన్,బాలస్వామి,ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.


