NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ నెల 22వ తేదీన వర్సిటీలో జాతీయ సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాయలసీమ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైన్సెస్ ఆధ్వర్యంలో “నేషనల్ ట్రెండ్స్ ఇన్ రీసర్చ్ & కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ సైన్స్ & టెక్నాలజి”అనే అంశంపై ఈ నెల 22వ తేదీన వర్సిటీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డీన్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, సదస్సు కన్వీనర్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య ఆర్. భరత్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు చేతులమీదుగా ఈరోజు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు చీఫ్ ప్యాట్రన్‌గా వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకటబసవరావు, ప్యాట్రన్లుగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి. విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో IICT, హైదరాబాద్ సైంటిస్టులు డాక్టర్ ఎస్. శ్రీధర్ ” అనే అంశంపై, డాక్టర్ ఎ. గంగాగ్నిరావు అనే అంశంగురించి వివరిస్తారని తెలిపారు. సదస్సుకు కో-కన్వీనర్లుగా బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ విభాగాల అధ్యాపకులు వ్యవహరిస్తారన్నారు. సైన్స్ అండె టెక్నాలజీ విభాగంలో ఆధునిక పరిశోధనలు, ఉపాధి అవకాశాల గురించిన విస్తృత చర్చలతోపాటు పోస్టర్ ప్రెజెంటేషన్ మొదలైన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కావున అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు https://rukap.edu.in ద్వారా పొందవచ్చని ఆచార్య భరత్ కుమార్ తెలిపారు. ఈ బ్రోచర్ విడుదల కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి. విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, ఎన్​ఎస్​ఎస్​ సమన్వయకర్త డాక్టర్ బి. కవిత, జువాలజి విభాగ సమన్వయకర్త డాక్టర్ బి. విజయుడు, ఫుడ్ సైన్స్ విభాగ సమన్వయకర్త డాక్టర్ జి.వి. స్వర్ణలత, బయోటెక్నాలజీ విభాగ సమన్వయకర్త డాక్టర్ కె. మోనిక, అధ్యాపకురాలు డాక్టర్ ఎ. బిందుప్రసూన తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *