ఘనంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవం
1 min read

చాగలమర్రి రూరల్ న్యూస్ (నేడు): చాగలమర్రి పట్టణంలోని పెన్షనర్ల సంఘం కార్యాలయంలో బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి అధ్యక్షుతన ఘనంగా పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిపుల్ పెన్షన్ బెనిపీట్లు సాధించేందుకు కృషి చేసిన డిఎస్ నకరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పెన్షనర్లకు ఉచిత వైద్య సహాయాన్ని సత్వరం అందించేలా,పెన్షన్ల బెనిపీట్లను సకాలంలో అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరారు.కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఏవీ సత్యనారాయణ,ఉపాధ్యక్షుడు యోహాన్,కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డి,సలహాదారులు జీవీ సుబ్బారెడ్డి,ప్రభాకర్ రెడ్డి,పెన్షనర్లు పాల్గొన్నారు.

