11న జాతీయ యునాని దినోత్సవం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/14-7.jpg?fit=550%2C264&ssl=1)
ప్రభుత్వ ఆసుపత్రి యునాని ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం
శిబిర0 ప్రారంభకులు ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు డా:కె కల్పనా కటాక్షం
నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మెడికల్ ఆఫీసర్ డా:జి రఘునాథ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ యునాని దినోత్సవం సందర్భంగా ఈనెల 11వ తేదీ మంగళవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని యునాని వైద్యశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వ యునాని వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డా:జి.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య శిబిరాన్ని ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు డా:కె.కల్పనా కటాక్షం ప్రారంబిస్తారని, వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు చేసి, మందులను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. యునాని వైద్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా:రఘునాథ్ కోరారు.