గంజాయి వద్దు..పిల్లల భవిష్యత్తుకు బాట వేయండి
1 min read
గ్రీన్ కో కార్మికులకు ఎస్సైలు సుజన్ కుమార్,సునీల్ కుమార్ అవగాహన..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : గంజాయి వద్దు మీ పిల్లల చదువులకు వారి భవిష్యత్తుకు పునాది బాట వేయాలని ఈగల్ ఎస్సై సుజన్ కుమార్ మరియు ఓర్వకల్లు ఎస్సై సునీల్ కుమార్ అన్నారు.మంగళవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని గుమితం తాండ గ్రామంలోని ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ ఆదేశాల మేరకు గ్రీన్ కో సంస్థలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కంపెనీలో పనిచేస్తున్న కూలీలతో అవగాహన సదస్సు నిర్వహించారు.కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఎన్ సుభాషిణి మరియు గ్రీన్ కో యాజమాన్యం ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాస రావు సూపర్వైజర్ కే ప్రభాకర్ మరియు ఈగల్ సిబ్బంది ఎలీషా,మాసూమ్ వలీ, ఫర్హాత్,రమేష్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగాఎస్సైలు సుజన్ కుమార్, సునీల్ కుమార్ మాట్లాడుతూ కూలీల జీవితంలో గంజాయి వల్ల వచ్చే ప్రభావం గురించి వివరించారు.పిల్లలకు చదువు, కుటుంబానికి భవిష్యత్తు ఎలా ఉంటుంది?అందుకే ఈ వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని గంజాయి దుష్ప్రభావాలు గురించి వివరించారు.మందుల దుష్ప్రభావాలు:శరీరాన్ని బలహీనంగా చేస్తాయి,పనిలో ఉత్సాహం తగ్గుతుందికుటుంబ జీవితం దిగజారుతుంది.డబ్బు వృథా అవుతుందిచివరికి ప్రాణాలు పోతాయి.“నేను ఎటువంటి మందులు వాడను,నా కుటుంబం కోసం, నా ఆరోగ్యంగా ఉండేందుకు.”మీరూ మారితే,మీ పక్కవాళ్లు కూడా మారతారని ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు.
