ఫూలే సినిమాపై అభ్యంతరాలు ఎత్తివేయాలి …
1 min read
కర్నూలు జిల్లా కురువ సంఘం.డిమాండ్!
కర్నూలు, న్యూస్ నేడు: మూడు వేల ఏళ్ల కులవ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవాతావాది మహత్మా ఫూలే సినిమాపై అభ్యంతరాలు ఏత్తివేయాలని కర్నూలు జిల్లా కురువ సంఘం ఉపాధ్యక్షులు ధనుంజయ ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ కోశాధికారి కె సి నాగన్న కోరారు. ఈ దేశంలో అగ్రవర్ణాలు ప్రజలను క్షుద్రులు, శూద్రులు,ఛండాలురు మ్లెచ్చులు గా పేర్లు తగిలించి బానిసలుగా చూసిన అమానుషమైన కులవ్యవస్థ ఈ దేశంలో రాజ్యమేలింది,తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని,సమాజాన్ని భ్రష్టు పట్టించిన ఆ మనువాదుల దౌర్జన్యాలను ఒంటరిగా దీశాలి ఫూలే మనుషులందరిని పుట్టించిన వాడు దేవుడే అయినప్పుడు వ్యక్తి వ్యక్తికి తేడా లేదనే దృక్పథంతో సినిమా అనంత్ మహదేవన్ ఆద్వర్యంలో ప్రముఖ నటులు ప్రతీక్ గాంధీ పత్రలేఖ ప్రదానపాత్రల్లో ఫూలే సినిమా తయారైంది. దినిపై ఓ అగ్రవర్ణాల కులస్థులు వ్యతిరేకించడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు. అడ్డంకులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.స్వయంగా బ్రాహ్మణుదైన చిత్ర దర్శకుడు అనంత్ మహదేవన్ అభ్యన్తరాలను ఖండించిన సినిమా రిలీజు కాకపోవడం బాధాకరం.ఈ సమావేశంలో పుల్లన్న తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.