NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒధివీడులో… ‘జగనన్నే ఎందుకు కావాలి’

1 min read

ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ శ్రీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాజంపేట  నియోజకవర్గ పరిధిలోని  వీర బల్లి మండలంలోని ఒదివీడు సచివాలయం లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా ఎంపీపీ శ్రీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు ప్రతి గడప కు తిరిగి జగనన్న మనకు అందిస్తున్న సువర్ణ పాలన మరియు జగనే ఎందుకు కావాలో ప్రజలకు వివరించారు.ర్యాలీ గా తిరిగి కార్యక్రమం విజయవంతం చేశారు. ముఖ్యం గా ఎంపీపీ గారు మాట్లాడుతూ ప్రస్తుతం మన జీవన ప్రమాణాలు మెరుగు పడేలా పథకాలు పెట్టడం జరిగింది. సచివాలయం ద్వారా మెరుగైన సేవలు ప్రతి కుటుంబం బాగు పడే విదంగా పథకాలు పెట్టడం జరిగింది. ఎలక్షన్ కోసం ఏ ఒక్క పథకం పెట్టింది కాదు ప్రజలు యొక్క జీవితం సంతోషం తో ఉండాలని అధికారం వచ్చిన మొదటి దినం నుండి పరితపించే ముఖ్య మంత్రి.చదువుకొనే పిల్లలు కి అన్నివిధాలా సహాయం చేసారు, నిరుద్యోగ యువత కి లక్షల్లో ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి, వైద్యం గ్రామ గ్రామాన వైద్యశాల నిర్మించారు.  ప్రతి గడప కు డాక్టర్ ని పంపిన ముఖ్య మంత్రి.  ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ మల్లేశ్వరి గారు, వైసీపీ నాయకులు వీరానాగిరెడ్డి గారు , సర్పంచ్ శంకరమ్మా,శివ,, సుబ్బరామ రాజు ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ మహబూబ్ భాష, ఆన్సర్, ఆశ్రఫ్, శివరామ, గఫార్ సబ్ ,  మరియు స్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author