NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్స్ జిల్లా క్యాబినెట్ సమావేశం

1 min read

నూతన గవర్నర్ డా:డి. సుబ్బారావు అధ్యక్షతన నిర్వహణ

ప్రతి లయన్ వారి సేవలను విస్తృతపరిచి,లయన్స్ జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండేల ప్రయత్నం చేయలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు,న్యూ అశోక్ నగర్ లోని కె కె అండ్ హెచ్ ఎల్ కాంప్లెక్స్ నందు లయన్స్ జిల్లా ప్రి క్యాబినెట్ సమావేశం జిల్లా నూతన గవర్నర్ డాక్టర్ డి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ సేవ అనేది అవసరంలో ఉన్న వారికి చేయి అందించడమే కాకుండా వారి హృదయాలను స్పృశించటం కూడా అంటూ  రాబోయే లయన్స్ సంవత్సరం జూలై నుండి వినూత్నంగా, విభిన్నంగా మానవాళికి సేవ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని,జిల్లా క్యాబినెట్లో ఉన్న ప్రతి లయన్  ప్రతినిధి కూడా వారి వారి సేవలను విస్తృతపరిచి లయన్స్ జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలని, సేవే పరమార్ధం అన్నట్లు మానవాళికి సేవ చేసే సేవే భగవంతుని సేవగా భావించి సేవలందిద్దామన్నారు.లయన్స్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్.వి.వి.ఎస్. పాపారావునాయుడు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో వచ్చే లయన్స్ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో,అదే తపనతో సేవలందించి మన జిల్లా ఖ్యాతిని నలుదిశలా వ్యాపింప చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాబోయే సంవత్సరం బడ్జెట్ విషయాలు,బ్యాంకు పుస్తకాలు, జిల్లా లక్ష్యాలు,సేవా కార్యక్రమాల విస్తరణ మొదలైన అంశాలపై చర్చించారు.తదనంతరం జులై 3 నుండి 7వ తేది వరకు జరిగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కి హాంకాంగ్ కు బయలుదేరుతున్న గవర్నర్ డాక్టర్ సుబ్బారావు దంపతులను సభ్యులందరూ సత్కరించారు.ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పి సుభాష్ బాబు మాట్లాడుతూ డాక్టర్ సుబ్బారావు రాబోయే సంవత్సర కాలంలో ఉత్తమమైన సేవలు అందించి జిల్లా కీర్తిని చాటాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ ఆర్ వి ఎస్ సూర్యనారాయణరాజు,ద్వితీయ వైస్ గవర్నర్ వి సత్య స్వరూప్, పూర్వ పూర్వ గవర్నర్లు వి మురళీమోహనరావు,డాక్టర్ పి.విజయభాస్కరరెడ్డి,కాకరాల వేణుబాబు,డాక్టర్ వి.కే. పంకజాక్షన్,కే.వి.కిషోర్ కుమార్, ఈపూరి సత్యనారాయణ,జిల్లా క్యాబినెట్ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు,జిల్లా కేబినెట్ కోశాధికారి కే బీ రావు,చీఫ్ ఎడిటర్ వి వి స్వామి,పి ఆర్ ఓ వి వెంకటేశ్వరరావు,ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కూర్మ శ్రీనివాస్,డి.హేమసుందర్,పుట్టా  విజయ శ్రీ, సి హెచ్ అవినాష్ రాజ్,డాక్టర్ డీ సరస్వతి,వి రత్నకుమార్,వి రాజకుమారి,వి విష్ణు కుమార్, రీజియన్ చైర్ పర్సన్స్,జోన్ చైర్ పర్సన్స్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *