NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీతోనే.. ప్రజలకు మంచి భవిష్యత్​: టీజీ భరత్​

1 min read

1వ వార్డు పెద్ద మార్కెట్ లో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం

కర్నూలు, పల్లెవెలుగు: తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలో 1వ వార్డు పెద్ద మార్కెట్ ప్రాంతంలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు కలిసి రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఐదేళ్లలో కర్నూలులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు సమస్యలు చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించలేని నాయకులు ఇక అభివృద్ధి ఏం చేస్తారని ప్రశ్నించారు. యువత భవిష్యత్‌ కోసం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ ఐదేళ్లలో కరెంట్ బిల్లులు రెట్టింపు అయ్యాయని, గ్యాస్ ధరలు పెరిగాయని, నిత్యావసర సరుకుల ధరలు సైతం ఆకాశాన్ని అంటాయన్నారు. తమ పార్టీ అధికారంలో వచ్చాక ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. అర్హులకు తప్పకుండా పింఛన్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు బతకాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నందుకు ముస్లింలు ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. తనను నమ్ముకున్న ప్రజలందరిని ఇబ్బందుల్లేకుండా చూసుకుంటానని భరత్ హామీ ఇచ్చారు. మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తారని వైసీపీ నేతల దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆరు గ్యారెంటీలు ఐదేళ్లలో అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకే వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి ఆర్షద్, కార్పొరేటర్ లతీఫ్, టీడీపీ నేతలు ఆనంద్, హామీద్, రమీజ్ బాషా, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, టిడిపి నేతలు, కలీమ్, బాలు, కిరణ్, సాయి, ఆయాత్ బి, ఆనంద్, అశోక్, వినేశ్, ఆనంద్, అరవింద్, యోగేష్, అబ్బాస్, బుజ్జి కార్తిక్, నరసింహ, ప్రేమ్, ప్రభాకర్, నవీన్, భరత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

About Author