ఆపస్ మార్కాపురం జిల్లా కార్యవర్గం ఎంపిక
1 min read
మార్కాపురం , న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మార్కాపురం జిల్లా ఎన్నికలు స్థానిక వివేకానంద విద్యాపీఠం నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథి గా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ మాట్లాడుతూ టెట్ నుండి ఉపాధ్యాయులను మినహాయించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి తో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలో ఉత్తర్వులు విడుదలవుతాయని అన్నారు. సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అన్ని కేడర్ల ప్రమోషన్ కొరకు చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటన కార్యదర్శి సిహెచ్. శ్రావణ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది మానసిక సంసిద్ధతతో చేసే పని అని దానిని ప్రభుత్వ అధికారులు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అలాగే జిల్లా స్థాయిలో జరగాల్సిన పనులను కూడా రాష్ట్రస్థాయి నుంచి నిర్వహిస్తున్నారని, బోధనేతర పనులు ఎక్కువగా ఉండటం తో ఉపాధ్యాయులు మానసిక ఇబ్బందికి గురి అవుతున్నారని ఈ పని సరికాదని రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని సరిజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా నూతన కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల అధికారిగా శ్రీ కే వెంకటేశ్వర్ రెడ్డి వ్యవహరించగా పరిశీలకులుగా సిహెచ్ శ్రావణ్ కుమార్ వ్యవహరించారు మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా కే శంకర్రావు, ప్రధాన కార్యదర్శిగా కే. శ్రీనివాసులు , కోశాధికారిగా వి. రమణయ్య, గౌరవాధ్యక్షులుగా వై.కోటేశ్వరరావు, సంపర్క అధికారిగా కె విశ్వేశ్వరరావు లతోపాటు ఉపాధ్యక్షులుగా పి.కృష్ణయ్య , ఏ శ్రీకృష్ణ , పి శ్రీనివాసులు, బి శ్రీనివాసులు , యం.గీతా, కార్యదర్శులుగా. బి. శ్రీనివాసులు, కేవీ. సుబ్రమణ్యం, ఎన్.వి. రమణ, జె .రమాదేవి, కార్యవర్గ సభ్యులుగా పి రమేష్ నాయుడు, వివి సుబ్బయ్య, జె నరసింహ, డి .అనురాధ, పి. లోకనాథం, జి .నాగేంద్రుడు తదితరులు ఎంపికయ్యారు. మార్కాపురం డివిజనల్ కార్యదర్శిగా కె .బ్రహ్మ రావు, కనిగిరి డివిజనల్ కార్యదర్శిగా ఏ.వి.నారాయణ నియమితులయ్యారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె .మల్లికార్జున రావు ,ప్రధాన కార్యదర్శి టి .దిలీప్ చక్రవర్తి జిల్లా బాధ్యులు బి. గుణ ప్రసాద్, వి చంద్రశేఖర్ వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.



