NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్చి 14న జాతీయ లోక్ అదాలత్​ ..

1 min read

నం దికొట్కూర్ జూనియర్ సివిల్ జడ్జి దివ్య..

నందికొట్కూరు , న్యూస్​ నేడు: మార్చి నెల 14వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను  విజయవంతం చేయాలని  నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి వి దివ్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో స్థానిక కోర్టు ఆవరణంలో సోమవారం నందికొట్కూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో మరియు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి దివ్య మాట్లాడుతూ రాజీ అయ్యే సివిల్ మరియు క్రిమినల్ తగాదాల్లో ఇరుపక్షాలతో మాట్లాడి రాజీ అయ్యే విధంగా కక్చి దారులకు అవగాహన కల్పించాలని సూచించారు.జాతీయ లోక్ అదాలత్ కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మరియు నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లోని కక్ష దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి దివ్య అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి శరభయ్య,సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About Author