సేంద్రియ ఆహార ఉత్పత్తులు మెగా మేళా ఏర్పాటు రైతులకు శుభపరిణామం
1 min read

సేంద్రియ ఆహార అలవాట్లును చేసుకుని మనమంతా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, పకృతి వ్యవసాయ రైతులకు అండగా నిలవాలి
80 మంది ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తి రైతులు,180 వివిధ రకాలు ఉత్పత్తులు,50 స్టాల్స్ ఏర్పాట్లు
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లాంఛనంగా ప్రారంభించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక డిసియంయస్ ఫంక్షన్ హాలులో శనివారం రాష్ట్రంలోనే మొదటగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తొలిరోజు మెగా మేళాను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, డిసియంయస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు 80 మంది ఆర్గానిక్ వ్యవసాయ రైతులు, 180 రకాలు ఉత్పత్తులు, 50 స్టాల్స్ ను పరిశీలించి, రైతులు, డ్వాక్రా మహిళలు, వినియోగ దారులతో మాట్లాడారు. దేశీయ బియ్యం 8 రకాలు ఉంచిన రథచక్రాన్ని పరిశీలించారు. సెల్ఫీ పాయింటు దగ్గర జిల్లా కలెక్టరు సెల్ఫీ ఫోటో దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖలు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు, జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయ రైతులు ఉత్పత్తులతో మెగా మేళా నిర్వహించాలని ఆలోచన వచ్చిందని అన్నారు. తొలకరి జల్లు నాటికి రైతులకు, ఉద్యోగులకు, ప్రజలకు సబ్సిడీపై ఆకు, కూరగాయలు విత్తనాలను అందించాలని సూచించారు. వారికి ఉన్న కొద్దిపాటి స్థలంలో గాని బిల్డింగులు పైన గాని ఆకు, కూరగాయలు పండించుకుంటారని, దీని వలన చక్కని ఆరోగ్యం, డబ్బు ఆదా, మనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని అన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు ప్రజలు వినియోగించు కునేలా, రైతులు ప్రోత్సహించడం కోసం మెగా మేళా రెండు రోజులు ఏర్పాటు చేసుకునుట అభినందనీయమని అన్నారు. మంచి కార్యక్రమంలో నేనుకూడ పాల్గొనడం నాకు ఎంతగానో సంతోషం కలిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమం మన జిల్లాలో ఏర్పాటు చేసుకునుట రాష్ట్రానికే ఏలూరు జిల్లా ఆదర్శంగా ఉందని అన్నారు. రానున్న కాలంలో జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు మరింత ప్రోత్సహించి, ఆరోగ్య ఏలూరు జిల్లాగా కలిసికట్టుగా కృషిచేద్దామని అన్నారు.జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు,డిసియంయస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) పాల్గొని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడి యస్.కె.హమీబ్ భాషా, ఏపి యంఐపి పిడి డా.యస్. రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజా నాయక్, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మీ, పకృతి వ్యవసాయ జిల్లా మేనేజరు బి.వెంకటేష్ , మెప్మా పిడి యం.రాజబాబు, డిసివో అరిమిల్లి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోస్ జిల్లా ప్రెసిడెంటు చోడగిరి శ్రీనివాసరావు,ఏయంసి చైర్మన్లు మామిళ్ళపల్లి పార్థసారథి,గారపాటి రామసీత, తహశీల్దారు కె.గాయత్రీ దేవి, బిఆర్ సి అసోసియేషన్ కన్వీనరు బి.జె.కె.మురళీధర్, వివిధ శాఖలు అధికారులు, ఉద్యోగులు,పట్టణ ప్రముఖులు, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు రైతులు,వినియోగదారులు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


