లోకకల్యాణంకోసం పల్లకీ ఉత్సవం
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు: లోకకల్యాణంకోసం దేవస్థానం ఈ రోజు (28.12. 2025) రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరిపించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడుతుంది. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడ్డాయి.

