PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పల్లెవెలుగు’కృషి అభినందనీయం

1 min read

ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా.చంద్రశేఖర్​ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ.. పరిష్కరించే దిశగా వార్తలు రాసే ‘పల్లెవెలుగు’ దినపత్రిక… సాంకేతిక రంగంలోనూ (డిజిటల్​ మీడియా) దూసుకెళ్లడం అభినందనీయమన్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. చంద్రశేఖర్​ యాదవ్​. గురువారం పల్లెవెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్​ను కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ మల్టీ హాస్పిటల్​లో న్యూరాలజిస్ట్​ డా. హేమంత్​ కుమార్​తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ యాదవ్​ మాట్లాడుతూ ఆధునిక రంగంలో మీడియా పాత్ర కీలకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రశంసనీయమన్నారు.  వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత  ఇచ్చిందన్నారు.

About Author