NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలందరి భాగస్వామ్యం.. శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాల లక్ష్యం..

1 min read

కోడుమూరు, న్యూస్ ​నేడు : ఫిబ్రవరి 2 వ తేదీన జరగబోయే శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాల లక్ష్యం అని మన ఊరు మన జాతర కమిటీ సభ్యులు అంటున్నారు. శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాల క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం అన్నారు. ఫిబ్రవరి  1వ తేదీ నుండి 3 వ తేదీ వరకు జరిగే ఈ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కోడుమూరు పట్టణంలో ప్రజలు కూడా స్పందిస్తూ దాతలుగా విరాళాలు ఇస్తూ కమిటీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాల వేడుకలు, క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తూ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ తిరునాల వేడుకలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడమే తమ విధానమని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. ఇది ప్రతి ఒక్కరి జాతర. మన ఊరు మన జాతర అనే నినాదంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ తిరునాల వేడుకలకు సహకరిస్తున్న ప్రజలు, మహిళలు, వ్యాపారులు, బ్యాంక్ సిబ్బంది, అధికారులు, అనధికారులు, ప్రింట్ , ఎలెక్ట్రానిక్, సోషల్ మీడియా, సహకరిస్తున్న ,  స్పందిస్తున్న  ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

About Author