పత్తికొండ బార్అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
1 min read
పత్తికొండ , న్యూస్ నేడు: 2025-26 సంవత్సరానికి సంబంధించి పత్తికొండ బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు గురువారం ఎన్నికల అధికారి ఆవుల మైరాముడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, లైబ్రరీయన్ మరియు సహాయ కార్యదర్శి, మహిళా ప్రతినిధి పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20, 21 తేదీలలో రెండు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 22వ తేది నామినేషన్ల పరిశీలన, 23వ తేది నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 27వ తేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అనంతరం కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.