పెదవేగి మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం
1 min read

హాజరైన పలు శాఖల మండల అధికారులు
పలు అభివృద్ధి ప్రగతి పై సమావేశం
మండల ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షించాలి
ఎంపీడీవో నాగేంద్ర కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో జరిగింది,ఈ సమావేశం లో విద్య, వైద్య, గృహ నిర్మాణ,ఆర్ డబ్ల్యు ఎస్,ఐ సి డి ఎస్ ,ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్,వెలుగు, విద్యుత్,వ్యవసాయ,ఉద్యానవన ,రెవిన్యూ,తో బాటు వివిధ శాఖల అధికారులు మండలంలో తమ తమ శాఖల ద్వారా జరిగే అభివృద్ధి ప్రగతి పై సమావేశం లో వివరించారు,ఈ కార్యక్రమం లో దెందులూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామ సీత, పెదవేగి మండల టి డి పి అధ్యక్షులు ఈడ్పుగంటి అనీల్,పెదవేగి సొసైటీ అధ్యక్షులు తాతా సత్యనారాయణ, మోoడూరు సొసైటీ అధ్యక్షులు కొనకొళ్ల శివ (శివమణి) రామసింగవరం ఎమ్ పి టి సి గుర్రం మాధవరావు,ఎమ్ పి డి ఓ నాగేంద్రకుమార్ తో బాటు ఎమ్ పి టి సి సభ్యులు నెక్కలపూడి రాజారత్నం,ఉప్పులూరి సామ్రాజ్యం,గెడ్డం సుజాత,రామసింగవరం సర్పంచ్ అడపా శ్రీనివాసరావు, తాళ్లగోకవరం సర్పంచ్ నెక్కలపూడి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

