రాష్ట్రంలో చర్మకారుల,డప్పు కళాకారుల పెన్షన్లను వెంటనే విడుదల చేయాలి
1 min read

సంక్షేమ పెన్షన్లు కూడా విడుదల చేయాలని డిమాండ్
దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్
లింగపాలెం మండలంలో దళిత సేన సమావేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్రంలో సంక్షేమ పెన్షన్లను వెంటనే విడుదల చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దళిత సేన డిమాండ్ ఆదివారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో ఏర్పాటు చేసిన దళిత సేన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పెన్షన్లు,వృద్ధాప్య పెన్షన్లు, డప్పు కళాకారులు పెన్షన్లు మరియు చెప్పులు కుట్టే చర్మకారుల పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని రవి ప్రకాష్ డిమాండ్ చేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పెన్షన్లు విడుదల చేసే విషయంలో ఏపీ సీఎంశ్రీనారాచంద్రబాబు నాయుడు తగు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా దళిత సేన మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ ఏలూరు జిల్లా దళిత సేన వర్కింగ్ ప్రెసిడెంట్ సికాకొల్లు స్టాలిన్, లింగపాలెం మండల బీసీ సెల్ దళిత సేన అధ్యక్షులు కొప్పుల నాగేందర్, చింతలపూడి పట్టణ దళిత సేన అధ్యక్షులు మోనూరి కార్తీక్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.

