గురుకుల కళాశాల సమస్యలపై మంత్రికి వినతి..
1 min read

వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలని వినతి
మంత్రి డోలాకు వినతి పత్రం అందజేత..
నందికొట్కూరు , న్యూస్ నేడు : ఉమ్మడి జిల్లాలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న గురుకుల కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు అదనపు గదులు మరుగుదొడ్లు మరియు వాటర్ ప్లాంట్ కు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రాన్ని నల్లమల్ల స్వాములు,వాడాల శేషు అందజేశారు.సోమవారం కొత్తపల్లె మండల పరిధిలోని దుద్యాల గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’కార్యక్రమంలో పర్యటిస్తున్న మంత్రిని గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్,కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో గురుకుల కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని,అంతేగాక దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్,నీట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న చిన్నటేకూరు బాలుర గురుకుల కళాశాల విద్యార్థులకు అదనపు గదులు,మరుగుదొడ్లు,వాటర్ ప్లాంట్ మరియు సరైన మౌలిక వసతి మరియు సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.స్పందించిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అదనపు గదుల నిర్మాణం కోసం తమకు లెటర్ ఇచ్చారని త్వరలో యుద్ధ ప్రాతిపదికన గదుల నిర్మాణం చేపడతామన్నారు.జిల్లాలో బాలుర బాలికల వసతి గృహాల్లో 9 కోట్ల 50 లక్షల రూపాయలతో మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు.

