ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఎమ్మెల్యే బడేటి భరోసా
1 min read

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అదేక్రమంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నామని పునరుద్ఘాటించారు. సోమవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించీ, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించీ, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా జఠిలమైన సమస్యలన్నింటికీ పరిష్కారాలు మార్గాలు సుగమం అవుతూ వచ్చాయన్నారు. ఇదేస్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సంక్షేమాల అమలు విషయంలో ఎక్కడైనా అవాంతరాలు ఎదురైతే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యలకు కూడా పరిష్కారాలు చూపి, సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాకారం చేసేందుకు పాటుపడతానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

