వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కు ప్రజలు సహకరించాలి
1 min read
నగరపాలక సంస్థ కమీషనరు యస్.రవీంద్రబాబు
కర్నూలు , న్యూస్ నేడు: మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రివ నారా చంద్రబాబు ఆదేశాల అనుసరించి పేదరికాన్ని నిర్ములించడానికి ప్రతి సచివాలయం పరిధిలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ప్రారంభమైనదని, దీనికి నగర ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ కమీషనరు శ్రీ యస్. రవీంద్రబాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 2,73,576 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయుచున్నారని తెలియవచ్చినది కావున వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కు వచ్చే సచివాలయ ఉద్యోగస్థులకు సహకరించవలసిందిగా కోరడమైనది. ఈ సర్వే కు18 -50 సంవత్సరాల వయో పరిమితి ఉండి నిరుద్యోగులుగా ఉన్నవారు అర్హులు మరియు ఐటి సెక్టార్ నందు అన్ని సౌకర్యములు ఉన్నావా, లేదా తెలుసుకొని వారికీ అన్ని ఐటి సెక్టార్ సౌకర్యంలు కల్పించబడునని తెలియచేయడమైనది. కావున ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కు సహకరించి మరియు మార్చి, 10వ తేది వరకు ఈ సర్వే జరుగునని తెలియచేయడమైనది .