హోళగుంద బస్టాండ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం వినతిపత్రం
1 min read
టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతిని కలిసిన హోళగుంద నాయకులు
హోలగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి నివాసంలో హోళగుంద మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్. ఎర్రిస్వామి, జే. ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారహోళగుంద గ్రామ బస్టాండ్ సర్కిల్లో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తల కోరిక మేరకు ఈ వినతిపత్రాన్ని అందజేసినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక గొప్ప పథకాలు అమలు చేశారని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత అని కొనియాడారు. “ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో ప్రజాసేవ చేసిన ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని హోళగుంద గ్రామంలో ఏర్పాటు చేయాలని కార్యకర్తలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఈ విషయంపై స్పందించిన ఆలూరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ వైకుంఠం శివప్రసాద్ మరియు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి కార్యకర్తల అభిప్రాయం మేరకు హోళగుంద బస్టాండ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాము ముందుండి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్. ఎర్రిస్వామి, జే. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


