పినాక ఉచిత శిక్షణ విద్యార్థులకు సువర్ణావకాశం
1 min read
బస్తిపాటి నాగరాజు కర్నూల్ పార్లమెంట్ సభ్యులు.
విద్యార్థులను ఐఏఎస్,ఐపీఎస్ లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే పినాక స్థాపన
బి.యాదగిరి,ఆదాయ పన్నుశాఖ కమిషనర్ చెన్నై.
ఫౌండర్,పినాక ప్రజా సాధికార ట్రస్ట్.
కర్నూలు , న్యూస్ నేడు: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు కలలను నిజం చేసుకునే సువర్ణావకాశం పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ఉచిత శిక్షణ తరగతుల ద్వారా సాధ్యమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక శ్రీలక్ష్మీ పాఠశాలలో జరుగుతున్న పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ఆద్వర్యంలో కోర్సు డైరెక్టర్,ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ అద్యక్షతన జరిగిన ఉచిత శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ మెంబర్ బస్తిపాటి నాగరాజు, చెన్నై ఆదాయపని శాఖ కమిషనర్ బి.యాదగిరి, అమీలియా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్, శ్రీలక్ష్మి హై స్కూల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ పీ.దీక్షిత్,సెట్కూరు సీఈవో డాక్టర్ కురుబ వేణుగోపాల్,నగరపాలక సంస్థ అకౌంటింగ్ ఆఫీసర్ రఘునందన్,డీసీటీఓ రామకృష్ణ,గొర్రెల సహకార సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా చైర్మన్ శ్రీనివాసులు,అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారి కురువ ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా రాయలసీమ వ్యాప్తంగా 8 కేంద్రాలలో స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్,పర్సనాలిటీ డెవలప్మెంట్,లైఫ్ స్కిల్స్,గ్రూప్,సివిల్స్ సంబంధించి గైడెన్స్ కోర్సులు పినాక ద్వారా విద్యార్థిని విద్యార్థులు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో 21రోజులపాటు ఉచితముగా పినాక ద్వారా ఆదాయపన్ను శాఖ కమిషనర్ చెన్నై బి.యాదగిరి ఏర్పాటు చేశారని ప్రస్తుతం రాయలసీమ వ్యాప్తంగా 8 కేంద్రాలలో ఈ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని ఇందులో శిక్షణ తీసుకున్న విద్యార్థులు దాదాపు 6500 మంది ఉన్నారని వారిలో అధిక శాతం అనేక ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు చేయడం గొప్ప విషయమని వక్తలు అన్నారు, చెన్నై ఆలయపల్లి శాఖ కమిషనర్ బి యాదగిరి మాట్లాడుతూ పేద గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులను ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇలా స్థాపించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కె. రామకృష్ణ,కే బలరాం,డాక్టర్ శ్రీహరి,కురువ సుంకన్న,జమ్మన్న,కురువ ఎల్లప్ప,బత్తిన కిరణ్,కేసీ నాగన్న,వెంకటరాముడు,కల్లూరు సింగిల్ విండో చైర్మన్ పర్ల శేఖర్, అధ్యాపకులు సునీత రోజ్,స్వర్ణ, జాయిస్,మహేంద్ర,తిరుమలేష్, మహేష్,తదితరులు పాల్గొన్నారు.



