NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మారుమూల గిరిజన గ్రామాలలో పిఎo ‘జన్ మన్’ కార్యక్రమం ద్వారా విద్యుత్ వెలుగులు

1 min read

65 లక్షల రూపాయలతో

13కె డబ్ల్యు మరియు బండారు గూడెం గ్రామం లో 12KW సోలార్ ఆఫ్ గ్రిడ్ ఏర్పాటు

85 ఆదివాసి కుటుంబాలకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ  విద్యుత్ సౌకర్యం

ఏలూరు సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ పి.సాల్మన్ రాజు

ప్రధానికి,ముఖ్యమంత్రికి,జిల్లా ఇన్చార్జ్ మంత్రికి,కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు  విద్యుత్ వెలుగులు తీసుకువచ్చారు.  ప్రధానమంత్రి జన జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) పథకం లో బాగంగా  కుక్కునూరు మండలంలోని రావి గూడెం పంచాయతీ లోని చీపురు గూడెం గ్రామంలో 65 లక్షల రూపాయలతో 13కె డబ్ల్యు మరియు బండారు గూడెం గ్రామం లో 12KW సోలార్ ఆఫ్ గ్రిడ్ ఏర్పాటుచేసి అక్కడ ఉన్న 85  ఆదివాసి కుటుంబాలకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ  విద్యుత్ సౌకర్యం కల్పించారు.  ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ పి.సాల్మన్ రాజు కుక్కునూరు మండలం చీపురుగూడెం లో సోలార్ ఆఫ్ గ్రిడ్ ను  ప్రారంభించారు.  ఇప్పటివరకు  విద్యుత్ వెలుగులు ఎరుగని ఆ మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు పిఎం జన్ మన్ పధకం ద్వారా విద్యుత్ సౌకర్యం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్,జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి లకు తమ కృతఙ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమంలో ట్రాన్స్కో డీఈ ఖాన్, ఏడిఈ కట్టా రమేష్ , స్థానిక కూటమి పార్టీల నాయకులు ప్రభృతులు పాల్గొన్నారు.

About Author