శ్రీ మదనగోపాల స్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం
1 min read
దుగ్గిరాల గ్రామంలో అంబరాన్నంటిన ఆడపడుచుల ఆనందం
దుగ్గిరాల గ్రామ ఆడపడుచులకు ఎమ్మెల్యే చింతమనేని చీర,మామిడి పండ్లు,తాంబూలం కలగలిసిన పసుపు-కుంకుమ కానుకలు పంపిణీ
సొంత సోదరుని వలె 400మంది గ్రామ ఆడపడుచులపై కొండంత అభిమాo
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాజకీయాలకతీతంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంతోనూ ఆత్మీయ అనుబంధాన్ని పంచుకునే దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో శనివారం ఉదయం జరిగిన శ్రీ మదనగోపాల స్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం సందర్భంగా విచ్చేసిన గ్రామ ఆడపడుచులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన ‘చింతమనేని చారిటబుల్ ట్రస్ట్’ తరపున పసుపు కుంకుమ కానుక అందజేశారు.ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన సుమారు 400 మంది గ్రామ ఆడపడుచులకు ఒక తోడబుట్టిన సోదరునిలా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా సంప్రదాయబద్ధంగా చీరలు, మామిడి పండ్లు మరియు తాంబూలంతో కూడిన కిట్‌లను వారికి పేరుపేరునా పంపిణీ చేశారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, గ్రామ బిడ్డగా ప్రతి ఒక్కరినీ ఇంటి పేరుతో సహా ఎంతో అభిమానంగా పేరుపేరునా పలకరిస్తూ ఆయన చూపిన అభిమానం అందరినీ ఆకట్టుకుంది.ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచి కానుకలు అందుకున్న మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. “మా గ్రామ ఆడపడుచులకు జరిగిన మేలుతో పాటు, మా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పండుగ పూట ఇలాంటి కానుకలు అందించడం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఔదార్యానికి నిదర్శనం” అని వారు కొనియాడారు. చింతమనేని ప్రభాకర్ తమకు ఎమ్మెల్యేగా కంటే, కష్టసుఖాల్లో అండగా ఉండే ఒక అన్నలా ఎప్పుడూ కనిపిస్తారని వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే ప్రభాకర్ పేర్కొన్నారు. మహిళల సంక్షేమం మరియు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే తమ లక్ష్యమని, ఆధ్యాత్మిక వేడుకల్లో గ్రామ ఆడపడుచులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ సతీమణి రాధారాణి సహా వారీ కుమార్తెలు నవ్య శ్రీ, మరియు శ్రీ ప్రణయతలు స్వయంగా పాల్గొని పసుపు కుంకుమ కానుకలు పంపిణీ నిర్వహించారు.


