NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పొన్నూరు: సేవా దృక్పథంతో చలివేంద్రం నిర్వహణ అభినందనీయం

1 min read

పొన్నూరు, న్యూస్​ నేడు:  పొన్నూరు పట్టణంలోని తెలగపాలెం రంగా బొమ్మ సెంటర్ వద్ద ‘మన పొన్నూరు వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నేటికి విజయవంతంగా 40 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు బాటసారులకు, ప్రజలకు పెద్ద ఎత్తున తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటున్న పేదలకుమజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన తిరుమలశెట్టి సీతారామయ్య – సామ్రాజ్యం తిరుమల శెట్టి నాగేశ్వరరావు మరియు కామర్తి పాపయ్య నాయుడు – పిచ్చమ్మ ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అందించిన ఆర్థిక సహకారంతో ఈ మజ్జిగ పంపిణీ జరిగింది.ఈ సందర్భంగా మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమలశెట్టి ఉమాశంకర్  మాట్లాడుతూ.. ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ముందుకు వచ్చిన దాతల ఉదారతను కొనియాడారు. మానవత్వంతో సహకరించిన తిరుమల శెట్టి కామర్తి   కుటుంబ సభ్యులకు అసోసియేషన్ తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రెజరర్ చిలకపాటి సింహాద్రి,రత్నం స్థానిక నేతలు పాల్గొన్నారు.వరుసగా 40 రోజులుగా నిరంతరాయంగా చలివేంద్రాన్ని నిర్వహిస్తూ, ప్రజలకు సేవలు అందిస్తున్న మన పొన్నూరు వెల్ఫేర్అసోసియేషన్ సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు.

About Author