12 బెంగళూరు విస్కీ బాటిల్స్ స్వాదీనం
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: రెండు వేరు వేరు ప్రాంతాలలో నాటుసారా మరియు ఎక్సైజ్ నేరంల నిమిత్తం దాడులు చేయగా దొడ్డి పాడుకు సంబంధించిన ఫకీర్ దస్తగిరి వద్ద 12 బెంగళూరు విస్కీ బాటిల్స్ కలిగి ఉండడం వలన అతని అరెస్టు చేయడం జరిగినది.తదుపరి శ్యామల నగర్ లో వెంకట రామయ్య అనే వ్యక్తి వద్ద 10 డిఫెన్స్ లిక్కర్ బాటిల్లు కలిగి ఉండడం వలన కేసు నమోదు చేయడమైనది. అనంతరం బుధవారపేటలో నాటు సారా కి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎస్సైలు నవీన్, శ్రీమతి రెహనా బేగం మరియు సిబ్బంది పాల్గొన్నారు . మరో ముఖ్య గమనిక వివిధ ఎక్సైజ్ నేరాలలో పట్టుబడిన వాహనముల వేలం ప్రక్రియ 5 వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుంది కావున వేలంలో పాల్గొను వేలం దారులు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ మరియు పాన్ కార్డు తో సహా ధరావత్తు సొమ్మును కూడా తీసుకొని వచ్చినట్లయితే వేలంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.